High Court: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు.