ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…