భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ…