అనంతపురం టీడీపీలో నేతల స్టైలే వేరు. రాజకీయ ప్రత్యర్థులను వదిలేసి.. తమలో తామే పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తారు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు సంబంధం లేకుండా పుట్టపర్తిలో ఎలా పర్యటిస్తారని జేసీని పల్లె ప్రశ్నిస్తుంటే.. కార్యకర్తలలో భరోసా నింపడానికే వెళ్లానని బదులిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఒక ప్రైవేటు స్థలంపై సాగుతున్న వివాదం.. అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. అక్రమాలు నిగ్గు…
ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ, టీడీపీ మధ్యే కాదు… టీడీపీ వర్సెస్ టీడీపీగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పుట్టపర్తికి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు.. మరో వైపు పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేతృత్వంలో స్వంత పార్టీ వారే నిరసనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే జేసీని…
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే సెగ మొదలైందా..? కొందరు టీడీపీ నేతలే ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారా..? అందుకే ఉలిక్కిపడి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారా..? ఇంతకీ పుట్టపర్తిలో పల్లెకు వచ్చిన కష్టమేంటి? పుట్టపర్తి టీడీపీలో పల్లెకు సెగ మొదలైందా? పల్లె రఘునాథరెడ్డి. మాజీ మంత్రి. అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్. విద్యావేత్తగా ఉన్న ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా.. మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు పల్లె. రెడ్డి…