గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి.
Gaza: ఇజ్రాయెల్ ఆధినంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతులేని అగచాట్లకు నిదర్శనం అని చెప్పాలి. కనీసం ఆహారం దొరక్క వాళ్లు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం దగ్గర ఫ్రీగా ఆహార పంపిణీ చేసే కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు.
Israeli Strikes: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు జరపడంతో 10 మంది పాలస్తీనియన్లు మరణించగా, 40 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ విమానాలు అల్ అవదా, అల్ అక్సా హాస్పిటల్ కాంప్లెక్స్ లపై కూడా బాంబు దాడి చేశాయి. ఇందులో 22 మంది మరణించారు. అలాగే, గాజాలోని నుసిరత్ శరణార్థి ప్రాంతంలో ఉన్న అల్ ముఫ్తీ స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కూడా గాలింపు…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 22 మంది మరణించారు. గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 22 మంది పాలస్తీనియన్లు మరణించారు. 30 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరి కొత్త ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల గురించి కూడా ఉన్నాయి.
శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లకు మద్దతుగా ఐక్యమైన, స్థిరమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మాడ్‌జిద్ టెబ్బౌన్‌తో ఫోన్ సంభాషణలో రైసీ ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు.