Pakistan Violence: దాయాది పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీతో పాక్ సర్కార్ అప్రమత్తమైంది. ఈరోజు ( అక్టోబర్ 10న) జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా ఆపేశారు.