కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.