ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్‌ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్‌లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు.