అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు.
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్త చెప్పింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచింది. గతంతో పోలిస్తే తాజా కాంట్రాక్ట్‌లో వారికి అందించే మొత్తాన్ని దాదాపు 4 రెట్లు పెంచినట్లు క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది.