భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్, పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వ్యక్తి పాకిస్తానీ పౌరుడని తెలుస్తోంది.
నోయిడా పోలీసులు తన భారతీయ ప్రేమికుడితో కలిసి జీవించడానికి భారతదేశంలోకి చొరబడిన పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను ఆమె గుర్తింపును ధృవీకరించడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పంపారు.