భారత్‌పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది.
Drones: ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలొస్తున్నాయ్. కారణం నిత్యం దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పాక్ డ్రోన్లు దేశంలోకి ప్రవేశిస్తుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కలకలం రేగింది.