Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
Jaish-e-Mohammad New Strategy: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సరికొత్త వ్యూహాం అమలు చేస్తుంది. భావోద్వేగ, మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు చేసిందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో పాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు.
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్‌పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
Terror Activity : మొన్న విజయనగరం, నిన్న రాయచోటి.. నేడు ధర్మవరం.. ఉగ్రవాదుల కదలికలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. సాధారణ జనంలో కలిసి పోయి ఉండి.. నిత్యం దాయాది దేశం పాకిస్తాన్‌లోని ముష్కర సంస్థలతో కొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ముష్కర మూకలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.…
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది.
మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన…
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.