Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్త ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యాయి. అయితే, తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న స్పందించారు. అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలని శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత అతని మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు…