Pakistan Navy Warship PNS Saif Visits Bangladesh: గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. పాకిస్థాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక, PNF SAIF, నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుందని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.
Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది.