Pakistan: పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.