Pakistan: పాకిస్తాన్‌తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.