India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా చెప్పబడుతున్న ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమెరికాతో పాటు పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి ఈ ఒప్పందం మరింత ఆందోళనలను, భయాన్ని కలిగిస్తోంది.