జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 26 మంది అమాయక జనాలు చనిపోడంతో సంతాపం ప్రకటిస్తు్న్నారు. పర్యటకులను కాల్చి చంపే ముందు.. ఉగ్రవాదులు వారి మతం గురించి అడిగారు. మానవాళికే సిగ్గుచేటు తెచ్చిన ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ నగరం భగత్ సింగ్ చౌక్ సమీపంలోని రోడ్లపై నిరసన…
వర్గం పేరు అడిగి దాడి చేయడాన్ని సభ్య సమాజం ఖండిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్‌లో అసమర్థ నాయకత్వం ఉందని.. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ నిప్పులు పోస్తుందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. భారత్‌ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటే అన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్య అని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను వీడే ప్రసక్తే లేదని…