26/11 ముంబై దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని ముంబై పేలుళ్ల కుట్రదారుడు తహవూర్ రాణా అంగీకరించాడు. తహవూర్ రాణాను అమెరికా.. భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. విచారణలో తహవూర్ రాణా సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.