ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే…
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.