ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.