పాకిస్తాన్‌కు భారత్‌లో బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా భారత్‌లో నిలిపివేయబడింది. దీనికి గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో 30వ తేదీ గురువారం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసింది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి భారత్‌లో నిలిచిపోయింది. పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఇది రెండోసారి.