హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని,…
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన…