బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత, మనోజ్‌కుమార్ (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్‌కుమార్ 1937లో అభివక్త భారత్‌కు చెందిన అబోటాబాద్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ప్యాషన్’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరోగా ‘కాంచ్ కి గుడియా’…