బంగ్లాదేశ్ ప్రజల చిరకాల కల ఈ బ్రిడ్జ్. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా శనివారం ప్రారంభం అయింది. దేశ ప్రధాని షేక్ హసీనా దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు, రైలు వంతెనను ప్రారంభించారు. పూర్తిగా దేశీయ నిధులతో ఎలాంటి విదేశీ సాయం లేకుండా ఈ వంతెన నిర్మించారు. రాజధాని ఢాకాతో నైరుతి బంగ్లాదేశ్ ను కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో సహాయపడుతుంది. పద్మ నదిపై 6.15 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల రోడ్డు-రైలు వంతెనను నిర్మించారు. బంగ్లాదేశ్…