ఇదిలా ఉంటే, బెంగాలీలు అత్యంత పవిత్రంగా భావించే దుర్గాపూజ సమయంలోనే భారత్‌కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఎగుమతి అయ్యే ‘‘పద్మ హిల్సా’’ చేపలపై నిషేధం విధించింది. ప్రతీ ఏడాది దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయంగా భావిస్తుంటారు.
Padma Hilsa: భారతీయులకు, ముఖ్యంగా బెంగాలీలకు బంగ్లాదేశ్ తీపి కబురు చెప్పింది. దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్టు ఇవ్వబోతోంది. పద్మా పులస(పద్మా హిల్సా) చేపల ఎగుమతికి ఓకే చెప్పింది. దుర్గాపూజ సీజన్‌కి ముందు 4000 మెట్రిక్ టన్నలు హిల్సా చేపలను విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారతీయ చేపల వ్యాపారుల ద్వారా ఈ రోజు రాత్రికి దేశానికి చేరుకుంటుంది.