గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ముర్ము చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న హిందూపురంలో ఆయన అభిమానులు భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటు పార్టీ శ్రేణులు ఇటు బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే…