కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర… సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.
రైతుల విషయంలో కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంటకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. రాబోయే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం లేదు. హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందన్నారు. చివరికి రుణమాఫీ కంటే వడ్డీ మాఫీ కార్యక్రమంగా నేను భావిస్తున్నా అన్నారు. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేస్తారో చేయండి అన్నారు జీవన్…