రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు… ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు…