Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Earthquake: ఓషియానియా దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలకు నెలవైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్దరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలైంది. అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా…