అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలకు నెలవైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్దరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలైంది. అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శనివారం ఉదయం నుంచే జావా ద్వీపంలో 3 వేల 6 వందల మీటర్ల ఎత్తైన ఈ అగ్ని పర్వతం నుంచి పెద్దఎత్తున బూడిద, వేడి రావడం ప్రారంభమైంది.
40 వేల అడుగుల ఎత్తువరకూ దట్టమైన పొగ, దమ్ము ధూళి అలముకుని వాతావరణం భయాందోళనలు కలిగించింది. తూర్పు జావా ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. అగ్నిపర్వతం విస్పోటనం అనంతరం అక్కడున్న బ్రిడ్జి దెబ్బతినడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొంతమంది చిక్కుకున్నారు. సెమెరు విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండోనేషియాలో ఏకంగా 130కి పైగా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు.