సీఎం, ఇరిగేషన్ మంత్రులకు పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. అనంతపురం జిల్లా హంద్రీనీవా ప్రధాన కాల్వ రాగులపాడు వద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద నిల్వ నీటిని పంప్ చేయాలని కేశవ్ లేఖలో కోరారు. గత 15 రోజుల నుంచి నీరు నిలిచిపోవటంతో రబీ సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వేరుశనగ రైతులు దాదాపు 20వేల ఎకరాల్లో పంట వేసి నీటి…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…
టిడిపి సీనియర్ ఎంఎల్‌ఎ, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కులేఖ రాశారు. కాగ్ తరపున లతామల్లికార్జున్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి…