ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (24) తన రికార్డునే తానే బద్దలుకొట్టుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టుకున్నాడు. నీరజ్ చోప్రా గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.07 మీటర్లు విసిరాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 2021, ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు…