(జూన్ 12తో ‘పాలు – నీళ్ళు’కు 40 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ‘గురువుగారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుదే! చిత్రసీమకు దాసరి చిత్రాల ద్వారా పరిచయమైన వారూ, వారి ద్వారా సినిమా రంగంలో రాణించిన వారు – ఇలా దాసరికి ఎంతోమంది శిష్యప్రశిష్యులు ఉన్నారు. వారిలో విలక్షణ నటుడు మోహన్ బాబు స్థానం ప్రత్యేకమైనది. దాసరి తెరకెక్కించిన అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మోహన్ బాబును హీరోగా నిలపాలని దాసరి…