ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన…