ఏఆర్ రెహ్మాన్ ను తన బయోపిక్ తీయాలని కోరిన పి.సుశీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన బయోపిక్ చేయాలని ఆమె రెహమాన్‌ను రిక్వెస్ట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ “రీసెంట్ గా నేను సుశీలమ్మతో మాట్లాడాను. ఆమెను “99 సాంగ్స్” మూవీ చూసారా ? అని అడిగాను. ఒకవేళ ఇంకా సినిమాను చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో చూడమని చెప్పాను. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో సుశీలమ్మకు చూపించమని రిక్వెస్ట్ చేశాను. సినిమా చూసిన తరువాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్‌ను “99 సాంగ్స్” చిత్రంలా చేయమని ఆమె నన్ను కోరింది”అని తెలిపారు. సుశీలమ్మ ప్రశంసలు కురిపించడంతో రెహమాన్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. మరి ఆయన సుశీలమ్మ బయోపిక్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!