మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ” కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధిని చూపిస్తారు.. కానీ, నేను ఎదుటువారి మంచి కోరుకొనేవాడిని.. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నా అభిమానులకు నేను ఒకటే చెప్పాను. నేను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, నా స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తాను. మన చిత్తశుద్ధి,…
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం,…