29 Killed During Capture Of Drug Lord El Chapo's Son: మెక్సికన్ డ్రగ్ లార్డ్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ కొడుకు ఒవిడిలో గుజ్మాన్ ను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో దాదాపుగా 29 మంది మరణించారు. ప్రస్తుతం జోక్విల్ గుజ్మాన్ మెక్సికోలో జైలులో ఉన్నాడు. ప్రభుత్వ దళాలు, గుజ్మాన్ ముఠాకు చెందిన సభ్యుల మధ్య గురువారం భీకరమైన దాడులు కొనసాగాయి. మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో ఈ కాల్పలుు చోటు చేసుకున్నాయి.