పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొందరు సెక్యూరిటీ గార్డుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీశైలం దేవస్దానంలో కొంతమంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు కాకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంటకు చెందిన విద్యార్ధినీల మెయిల్ ఐడీలు హ్యాకింగ్ చేశారు. వారి ఫేస్ బుక్ లో అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ డబ్బు ఆశ చూపిస్తూ విద్యార్థినీలకు వల వేస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పర్సనల్ ఫోటోలను చూపించి అమ్మాయిలను వేధించడం…