సినిమా ఎలా వున్నా టీజర్ ట్రైలర్‌తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేటరికల్‌గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచే రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్‌కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్స్‌లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని అర్థం. Also Read : IdliKadai Review :…
అనిల్ రావిపూడి చివరిగా చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి, ఫ్యామిలీ సినిమా సత్తా ఏంటో చాటింది ఈ సినిమా. నామ్ థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ భారీగానే దక్కించుకొని, గట్టిగానే లాభపడింది. ఇక ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విషయంలో కూడా హక్కులు జీ స్టూడియోస్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు “మన శంకర వరప్రసాద్ గారు…
సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్…
టాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ పాటతో పాటు సీనియర్ నటుడు కృష్ణంరాజుకు సంబంధించిన ఓ ఎపిసోడ్, అలానే కొంత ప్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందం ఎప్పుడెప్పుడు దీనిని పూర్తి చేసి, జనం ముందుకు సినిమాను తీసుకువద్దామా అని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన టీ…