టాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తవ్వగా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. జూన్ 27న విడుదల కానుండటంతో ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈవెంట్లు, ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ ఇస్తూ కన్నప్ప చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తున్నారు. ఇక మామూలుగా ఈ తరహా భారీ సినిమాలకి ముందే ఓటీటీ డీల్స్ జరిగిపోతాయి కానీ ఈ సినిమాకి మాత్రం ఇంకా అవ్వలేదు హోల్డ్‌లోనే పెట్టారు. అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ విష్ణు రివీల్ చేశారు. ‘ఓటిటి ఆఫర్స్ వచ్చాయి కానీ మెము అడిగిన రేట్‌కి రాలేదు. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే మాత్రం మేము అడిగిన రేట్ ఇస్తామని చెప్పారు, వారికి ఆ మొత్తం రెడీ చేసుకోమని చెప్పను’ అని విష్ణు తెలిపారు. దీని బట్టి తన సినిమా పట్ల తాను ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.