ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. వన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హాజరయ్యారు. పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సజ్జల విరుచుకుపడ్డారు. ఓటిఎస్ పధకంపై…