బీఎస్పీతో దోస్తీ బీఆర్ఎస్లో చిచ్చు పెట్టిందా? సీనియర్ లీడర్ కారు దిగడానికి కారణం అవుతోందా? నిన్నటి ఎన్నికల్లో నన్ను బండబూతులు తిట్టిన మనిషితో నేడు చెట్టపట్టాలేసుకుని తిరగమంటారా? నావల్ల కాదంటూ గులాబీకి బైబై చెప్పేసిన ఆ లీడర్ ఎవరు? పక్క పార్టీలో ఆయనకు లభించిన హామీ ఏంటి? సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేస్తున్నారు. హస్తం గూటికి చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయిన…
ఆ సీటు యమా… హాట్. హాటంటే.. అలాంటిలాంటి హాట్ కాదు గురూ… అంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు. అందుకే రెండు పార్టీల నుంచి డజన్ మంది మాక్కావాలంటే మాకంటూ పోటీలు పడుతున్నారు. ఎవరి లెక్కలతో వారు లాబీయింగ్ చేస్తున్నారు. పోటీ తట్టుకోలేక చివరికి లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దన్న నినాదాన్ని కూడా తెర మీదికి తెచ్చారు. ఇంతకీ ఏదా హాట్ సీట్? ఏంటి అక్కడ స్పెషల్? తిరుపతి ఆధ్యాత్మికంగా ఎంత ఫేమస్సో…. పొలిటికల్గా ఈ అసెంబ్లీ…
ఒకరు సిట్టింగ్ ఎంపీ… ఇంకొకరు అదే సీటు ఆశిస్తున్న సీనియర్ లీడర్. ఇద్దరూ ఒకే వేదిక మీద ఉన్నారు. ఈసారి నేనిక్కడ పోటీ చేయబోతున్నాను. సీటు నాదేనని సిట్టింగ్ ముందే ప్రకటించారు ఆశావహుడు. అయినా ఎంపీ నుంచి నో రియాక్షన్. అసలా విషయం తనకు సంబంధించింది కాదన్నట్టే ఉన్నారు. ఆమె ఎందుకలా ఉన్నారు? ఏంటి వ్యూహం? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏదా నియోజకవర్గం? అమలాపురం ఎంపీ టిక్కెట్పై వైసీపీలో…
సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడిపోరు చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఘనంగా వెల్లడించాయి. ఆ సందర్భంగా పవన్ స్పీడ్ చూసిన వాళ్లకు ఆ రోజో.. ఆ తర్వాత రోజో కార్యాచరణ ప్రకటిస్తారని… రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రోడ్ల మీదకు వస్తారని అంతా అనుకున్నారు. అంతేనా… టీడీపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనసేనతో పోత్తుకు ఇక బీజం పడినట్టేనని అంతా భావించారు. కానీ నెల…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్గా భగ్గుమంటున్నారు. అసంతృప్త…
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా…