కడియం శ్రీహరి వ్యూహాత్మకంగానే కారు పార్టీని దెబ్బ కొట్టారా? ముఖ్య నేతలందర్నీ ముందే పంపేసి తాను తప్ప దిక్కులేని స్థితికి తీసుకువచ్చి… ఫైనల్గా హ్యాండివ్వడాన్ని ఎలా తీసుకుంటోంది బీఆర్ఎస్? తన కూతురు కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాక కూడా పార్టీ మారడం వెనకున్న ఎత్తుగడ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కడియం శ్రీహరి. బీఆర్ఎస్ గూటికి చేరాక పదేళ్ళ పాటు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పరంగా ఆయనకు కూడా…
ఆ పొలిటికల్ బ్రదర్స్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆశించి సీట్లు రాలేదు. అలాగని ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తాము ఏదో అనుకుంటే… అక్కడ ఇంకేదేదో జరిగిపోయింది. సీట్లు ఆశించిన పార్టీలు ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగాలా లేక నచ్చిన అభ్యర్థికి మద్దతివ్వాలా అన్న డైలమాలో ఉన్నారు ఇంతకీ ఎవరా బ్రదర్స్? ఏంటా స్టోరీ? బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అన్న ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు. ఈ బ్రదర్స్…
తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా? లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారా? కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది? గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు? లోక్సభ ఎన్నికల్లో ఈసారి టార్గెట్ 400 అంటున్న బీజేపీ ఆక్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది. ఆ లిస్ట్లో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట…
ఆ నియోజకవర్గంలో ఇంటిపోరు టీడీపీని ఇరుకున పెడుతోందా? పార్టీ అభ్యర్థికి కమ్మ సామాజికవర్గానికి మధ్య గ్యాప్ పెరిగిందా? అదే టోటల్గా తేడా కొడుతోందా? ఈ వర్గపోరు ప్రభావం గెలుపు అవకాశఆల మీద ఎంత వరకు పడుతుంది? రచ్చకెక్కు తున్న అంతర్గత పోరుకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? జగ్గయ్యపేట టీడీపీలో వార్ ముదురుతోందట. ఇప్పటి వరకు నేతల మధ్య ఉన్న కలహాలు ఇప్పుడు రచ్చెకెక్కి విమర్శలు చేసుకునే వరకు దాకా వెళ్ళడం పార్టీ అధిష్టానాన్ని కూడా…
తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి తలంటు స్నానాలు అవుతున్నాయా? నేరుగా పచ్చి బూతులు తిట్టడం ఒక్కటే మిగిలిపోయిందా? ఎంత చెప్పినా మీరు మారరా... అంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి డ్యాష్ డ్యాష్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోక్సభ ఎన్నికల వేళ టీ బీజేపీలో ఏం జరుగుతోంది?
శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఈసారి రామ్మోహన్ నాయుడికి మామూలుగా ఉండదా? గత రెండు విడతల్లో ఎదురవని, అసలు ఊహించని సమస్యలు ఎదురవబోతున్నాయా? సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడిస్తామని శపధం చేయడానికి కారణాలేంటి? మారుతున్న సిక్కోలు రాజకీయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది శ్రీకాకుళం జిల్లా. కానీ… గత ఎన్నికలలో వైసీపీ హవా నడిచింది. అందుకే ఈసారి పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది పార్టీ నాయకత్వం. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ముందున్నారన్నది…
ఏపీలో ఇప్పుడు పక్క చూపుల పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. అలాగని పార్టీ మారే నేతల గురించిన సబ్జెక్ట్ కాదు ఇది. కేవలం టీడీపీ, వైసీపీ అధిష్టానాలకు సంబంధించిన వ్యవహారం. ఎవరి ఇంటిని వాళ్లు చక్కబెట్టుకునే సంగతి ఎలా ఉన్నా… పక్కింట్లో ఏం జరుగుతుందోనని ఆరాలు తీయడం పెరిగిపోయిందట. ఇంతకీ ఏ విషయంలో రెండు పార్టీల అధిష్టానాలు ఎంక్వైరీలు చేస్తున్నాయి? దేని కోసం చూస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మే 13 ఫిక్సయింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు…