JR NTR: ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ మెంట్ తేదీ దగ్గర పడే కొద్దీ సినీబఫ్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ నామినేషన్స్ ప్రకటిస్తారు. ప్రపంచంలోని నలుమూలల ఉన్న భారతీయుల్లో ఈ దఫా ఆస్కార్ నామినేషన్స్‌పై ఆసక్తి రెట్టింపు అవుతోంది. రేసులో మన తెలుగు చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ పలు కేటగిరీల్లో పోటీకి సిద్ధం కావడమే మనవాళ్ళలో ఇంట్రెస్ట్ పెరగడానికి కారణమయింది. అమెరికాకు చెందిన ‘యుఎస్ఏ టుడే’ పత్రిక పదిమంది నటులను తప్పకుండా ఆస్కార్ కమిటీ…