వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అయ్యారు. ఈ ఏడాది చివరి రోజు మరికొన్ని గంటల్లో కాలగర్భంలో కలిసిపోనుంది. ప్రతి ఒక్కరు కొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే సంవత్సరాన్ని సంతోషంగా మార్చుకునేందుకు ప్రజలు చాలా పనులు చేస్తారు. కొంతమంది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు, మరికొందరు రాబోయే సంవత్సరాన్ని అదృష్టంగా మార్చడానికి ద్రాక్షపండ్లు తింటారు. అదేవిధంగా, నూతన సంవత్సరంతో ముడిపడి ఉన్న…