ప్రస్తుతం థియేటర్లతో సమానంగానే ఓటీటీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు లేకున్నాను, చిన్న సినిమాలు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టుకొంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లోనూ, ఓటీటీలోను విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన…
సిద్ధార్థ్, జి.వి. ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చయ్’. ఈ సినిమాను ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి డైరెక్ట్ చేశాడు. ఈ యాక్షన్ డ్రామా తమిళంలో 2019 సెప్టెంబర్ 6న విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిని ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ యేడాది ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది.…
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘శివప్పు ముంజల్ పచ్చై’ చిత్రం తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లు గా నటించారు. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘ఆహ ఎవరిది’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఆనంద్ అరవిందాక్షన్, యామిని ఘంటసాల ఆలపించగా… వెన్నెలకంటి లిరిక్స్ అందించారు. యూత్…