సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది.10వ తరగతి బోర్డు పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే నియమాలను ఆమోదించింది. ఇప్పుడు 10వ తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. ఈ అంశంపై పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రెండుసార్లు పరీక్షలు నిర్వహించే నమూనాను సీబీఎస్‌ఈ ఆమోదించిందని తెలిపారు.