Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.