Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.